TRENDING POST
- August 24, 2019 - Commerce ఘరానా మోసం రూ.5 వేలకు ఖాళీ బాక్సు..కంగుతిన్న యువకుడు
మండల పరిధిలోని దిన్నెపాడు పంచాయతీ బెస్తపల్లెకు చెందిన జింకా.ఆనంద్ అంతర్జాల కొనుగోలులో మోసపోయిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆనంద్ మాట్లాడుతూ తాను మోకాళ్ల కింది భాగంలో శస్త్రచికిత్స చేయించుకొన్నట్లు తెలిపారు.
ఆ ఆరోగ్యం మెరుగు కోసం ఫ్లిప్‌కార్డు ద్వారా అంతర్జాలంలో రూ.4990 విలువ చేసే గ్లోబల్ నర్వ్ సిక్స్‌ప్యాక్ అనే ఒక వస్తువును క్రిడెట్ కార్డు ద్వారా కొన్నట్లు చెప్పారు.
వారం రోజుల తర్వాత చిన్నపాటి బాక్సు ఇంటికి వచ్చింది. అది తెరచి చూడగా ఖాళీగా కన్పించింది. రెండు కవర్లు మాత్రమే అందులో ఉన్నాయి.
ఈ విషయాన్ని బాక్సుపై ఉన్న అడ్రస్సుకు సమాచారం చేరవేయడంతో వెనక్కి పంపితే చూస్తామని తెలిపారన్నారు. చేసేది లేక విలేకర్లను ఆశ్రయించి జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు న్యాయం చేయాలని కోరారు.

Comments